The Desk…Mudinepalli : మాణిక్యం కుటుంబానికి వైష్ణవి ఆర్థిక సాయం

The Desk…Mudinepalli : మాణిక్యం కుటుంబానికి వైష్ణవి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

మండలంలోని పేరూరు గ్రామంలో పేదరికంతో జీవిస్తున్న కుటుంబం ఒకటి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వనసం మాణిక్యం (80) అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మృతురాలికి కొడుకు ఉన్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పేదరికంచేత అంత్యక్రియలు నిర్వహించడానికి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అవసరమైన పరిస్థితి ఏర్పడింది.

విషయం తెలుసుకున్న మండలానికి చెందిన ప్రముఖ వైద్యుడు డా. మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్ధిని అంబుల వైష్ణవి మానవీయతను చాటుతూ ముందుకు వచ్చారు. తన తండ్రి ద్వారా.. మాణిక్యం అంత్యక్రియల నిమిత్తం ₹5,000 లు ఆర్థిక సాయం అందించారు. పేదరికంలో ఉన్న కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన వైష్ణవి మంచి మనసును పలువురు అభినందించారు.