ఏలూరు జిల్లా : కైకలూరు టౌన్ (క్రైమ్) : ది డెస్క్ :
కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యంను కోర్టు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డిఎస్పి డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక ముఖ్యమైన కేసులో పట్టుబడిన అక్రమ మద్యాన్ని సోమవారం డిస్ట్రక్షన్ ఆర్డర్ (Destruction Order) ద్వారా ధ్వంసం చేశారు.

A.P Excise Act. ప్రకారం స్వాధీనం చేసుకున్న మొత్తం 2,945 బాటిల్స్.ఫుల్ బాటిల్స్ (750 ml): 213 బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ (180 ml): 2,732 బాటిల్స్ ధ్వంసం చేశారు. ఎ. అవులయ్య (ఎక్సైజ్ సూపరింటెండెంట్) sk రమేష్ (ఎక్సైజ్ సీఐ), కైకలూరు టౌన్ ఎస్‌ఐ ఆర్ శ్రీనివాస్, గ్రామ రెవెన్యూ అధికారులు (VROలు), మధ్యవర్తులు సమక్షంలో ఈ మద్యం నిల్వలను ధ్వంసం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఏలూరు జిల్లాలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం వలన ఈ కేసులలో న్యాయ ప్రక్రియ పూర్తి అయినట్లు తెలియజేశారు.

