🔴 నెల్లూరు జిల్లా : నెల్లూరు : ది డెస్క్ :
ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అనే దానికి ఉదాహరణ ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం: దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15 వేల రూపాయలు జమ : దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఈరోజు ఒక్కరోజే రాష్ట్ర మొత్తం మీద రెండు లక్షల 90 వేల మంది ఆటో డ్రైవర్లకు 435 కోట్ల రూపాయలు వారి వారి అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది: దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
జిల్లాలో 17406 మంది ఆటో డ్రైవర్లకు 26 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాలలో జమ : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
రాష్ట్రం మొత్తం మీద విశాఖపట్నంలో 22,000 మందికి తదుపరి నెల్లూరు జిల్లాలో 17046 మందికి పథకం అమలు : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
శనివారం నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట, లక్ష్మీపురం లోని ఎస్ బి ఎస్ కళ్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ: రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు. పదిలక్షల కోట్ల రూపాయలకు వడ్డీలతోపాటు అసలు చెల్లిస్తూ పథకాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర మొత్తం మీద మూడు లక్షల 12 వేల దరఖాస్తులు రాగా స్క్రూట్ ని అనంతరం 2,91,000 మందిని అర్హులుగా ప్రకటించి వారికి 15వేలవంతున ఒకేసారి 435 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయడం జరిగిందన్నారు. నెల్లూరులో 17,46 మంది డ్రైవర్లకు గాను 26 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
నెల్లూరు అర్బన్ లో1821 మంది లబ్ధిదారులకు 2.7 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని అదేవిధంగా నెల్లూరు రూరల్ లో 3441 మంది, కందుకూరు నియోజకవర్గం సంబంధించి1004 మందికి, కావలి నియోజకవర్గం సంబంధించి 1888 మందికి ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించి 1636 మందికి కొవూరు నియోజకవర్గం సంబంధించి 2585 మందికి అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2651 మందికి ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి 1406 మందికి వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించి 974 మందికి వెరసి 17406 మందికి నగదు జమ చేయడం జరిగిందన్నారు.
వీరిలో మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా 402 మందికి, వైశ్య కార్పొరేషన్ ద్వారా ఇద్దరికీ, బీసీఏ కార్పొరేషన్ ద్వారా 2946, బిసి బి కార్పొరేషన్ ద్వారా:1921 మందికి, బీసీసీ కార్పొరేషన్ ద్వారా పదిమందికి, బి సి డి కార్పొరేషన్ ద్వారా 1755 మందికి బీసీఈ కార్పొరేషన్ ద్వారా 2045 మందికి బ్రాహ్మిన్ కార్పొరేషన్ ద్వారా 24 మందికి, ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా 340 మందికి, కమ్మ కార్పొరేషన్ ద్వారా 327 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 957 మందికి, క్షత్రియ కార్పొరేషన్ ద్వారా 14 మందికి, రెడ్డి కార్పొరేషన్ ద్వారా 744 మందికి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4804 కి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1014 మందికి మరియు ఇతరులకు 11 మందికి నగదు జమ చేయడం జరిగిందని వివరించారు. చూపించిన విధంగా సూపర్ సక్సెస్ కార్యక్రమం అయిందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచడం జరిగిందని, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ వంటి ప్రారంభించామన్నారు.
స్త్రీ శక్తి పథకం ద్వారా చాలామంది మహిళలు సుదూర ప్రాంతాల నుండి ప్రయాణించి విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు అన్నారు. మేనిఫెస్టోలో చూపించిన విధంగా అన్ని హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. జిఎస్టి టాక్స్ తగ్గించడం ద్వారా ఆర్థిక స్తోమత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి పథకానికి శ్రీకారం చుట్టిందని దానికి సంబంధించి నేడు జిల్లా మొత్తం మీద 17406 మంది డ్రైవర్లకు 26.1 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది అన్నారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎవరైనా మిస్ అయిన వారికి సచివాలయంలో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. మరిన్ని కొత్త పథకాలు రానున్నాయని ఆశ భావాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చందర్ మరియు డ్రైవర్ యూనియన్ నాయకులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత జిల్లాలోని 17,46 మందికి సంబంధించి 26.1 కోట్ల రూపాయలు భారీ చెక్కును మరియు నెల్లూరు రూరల్ కు సంబంధించి 1821 మందికి గాను రెండు కోట్ల 73 లక్షల భారీ చెక్కును లబ్ధిదారులకు అందజేశారు.
” ఆటో డ్రైవర్ సేవలో ” లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది.
లబ్ధిదారుడు షేక్ బాషా(54) జాకీర్ హుస్సేన్ నగర్ మాట్లాడుతూ : తనకి ఇద్దరు పిల్లలని నెలకు పదివేల రూపాయలు వంతెన కాలనీ ఆదాయంతో బతుకుతున్నామని వారు తెలిపారు. ఆటో రిపేర్లు వచ్చిన లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసమేనా ఇబ్బందులు పడడం జరిగేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి సంవత్సరానికి 15 వేల రూపాయలు అందజేయడం చాలా సహాయ పడుతుందని కొండంత సహాయం చేసినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అవకాశం కలిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు…
లబ్ధిదారుడు-2: K.రమేష్ బాబు(55), సెట్టిగుంట రోడ్డు మాట్లాడుతూ : తాను 1985 నుంచి ఆటోను నడుపుతున్నానని ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపాడు. బాడుగులకు తగ్గడం వల్ల ఆదాయం తగ్గిందని నెలకు 12 వేల రూపాయలు దాకా వస్తున్నదని తెలిపాడు. వచ్చిన ఆదాయంలో రిపేర్లకి తలకు అవసరమయ్యే నిధులు కూర్చోవడం కష్టంగా ఉండేదని అటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి 15వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం చాలా సహకారిగా ఉందని తెలిపారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ మొదలుకొని చిన్న చిన్న రిపేర్లు వరకు ఏం చేయాలంటే ఇబ్బందిగా ఉండేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయం మరువలేనిదని అభిప్రాయపడ్డాడు.

