THE DESK NEWS : ఏకాంత ప్రదేశంలో లవర్స్..‼️

THE DESK NEWS : ఏకాంత ప్రదేశంలో లవర్స్..‼️

విజయనగరం జిల్లా : నెల్లిమర మండలం : THE DESK NEWS :

లవర్స్ వద్దకు వెళ్ళి, బెదిరించిన హోంగార్డు – ఆపై యువతిపై అత్యాచారం..‼️

బాధితురాలి కంప్లైంట్ తో.. హోంగార్డు అరెస్ట్..‼️

పోలీసుల వివరాలు ప్రకారం..

బొండపల్లి పోలీసుస్టేషన్‌లో డ్యూటీ చేస్తున్న హోంగార్డు మొయిద సురేశ్‌ మంగళవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.

దారిలో కొండకరకం దగ్గర్లో.. ఓ లవ్ కపుల్ కనిపించడంతో వారి వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు.

తాను ఎస్సైని అని, ఇద్దరిపై కేసు బుక్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో ప్రియుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.

ఆ తర్వాత హోంగార్డు సురేశ్‌ ఆ యువతిని ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిస్తానని నమ్మించాడు.

ఆపై బైకుపై రామతీర్థం సమీపంలోని చంపావతి నది ఒడ్డునున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

తిరిగి ఆమెను రామతీర్థం సర్కిల్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు.

బాధితురాలు కంప్లైంట్ చేయడంతో.. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు సురేశ్‌ను అరెస్టు చేశామని.. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

www.thedesknews.net