The Desk…Vijayawada : పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

The Desk…Vijayawada : పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

  • రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.42 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ
  • ఎన్టీఆర్ జిల్లాలో 5 లక్షల 90 వేల మందికి, కృష్ణాజిల్లాలో 5 లక్షల 17 వేల మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.42 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా – 5,90,000 మంది లబ్ధిదారులు,కృష్ణా జిల్లా – 5,17,000 మంది లబ్ధిదారులు స్మార్ట్ కార్డ్ లను అందజేస్తున్నట్టు తెలిపారు విజయవాడ మరియు పెనమలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. సెప్టెంబర్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ కార్డుల పంపిణీ పూర్తి చేస్తాం అన్నారు.

కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే లబ్ధిదారుడు ఎప్పుడు సరుకులు తీసుకున్న సమాచారం వెంటనే ప్రభుత్వానికి చేరుతుంది. రాష్ట్రంలోని 29 వేల చౌక ధర దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమలు ప్రజలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తున్నాం. PoS మిషన్లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.కొండప్రాంతాలు, దూరప్రాంతాల వారికి సబ్-రేషన్ డిపోలు ఏర్పాటు చేయడం పై సిఎం తో చర్చ జరుగుతుంది.

కార్డులో మార్పులు/చేర్పుల కోసం స్థానిక సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా సంప్రదించవచ్చు.ఈ స్మార్ట్ రైస్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చు అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, సివిల్ సప్లై కమిషనర్ సౌరభ్ గౌర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.