The Desk…Eluru : పార్టీ ప్రతిష్ఠను నిలబెడదాం                 ‎➖(MP) మహేష్ పుట్టా

The Desk…Eluru : పార్టీ ప్రతిష్ఠను నిలబెడదాం ‎➖(MP) మహేష్ పుట్టా

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ‎

పార్టీ నాయకులంతా ఐకమత్యంగా ఉంటూ, పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఏలూరు జిల్లా పార్లమెంట్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న గన్ని వీరాంజనేయులు గారు అందరినీ సమన్వయంతో నడిపించారనీ, అదేవిధంగా ఇప్పుడు ఎవరికి అవకాశం వచ్చినా, అందరం సమన్వయంతో కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటు, కొత్త కమిటీ ఏర్పాటు కోసం నాయకులు ఇచ్చిన పేర్లను హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని, వీటిపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయాన్ని మనందరం గౌరవిద్దామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ.. అందరితోనూ సఖ్యతగా ఉంటూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, తన దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పుట్టా మహేష్ కుమార్ వంటి ఎంపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి దొరకటం ఇక్కడి ప్రజల, కార్యకర్తలు చేసుకున్న అదృష్టమని చెప్పారు. ఎటువంటి వివాదాలు లేకుండా, నిరంతరం జిల్లా అభివృద్దే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.‎

ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులుగా వచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సి బుద్దా నాగజగదీశ్వరావులతో పాటు, జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి నాయకులు, కార్యకర్తలు  భారీగా తరలిరావటంతో సమావేశం నిర్వహించిన హాలు కిక్కిరిసిపోయింది.

మంత్రులు, ముఖ్యనేతల ప్రసంగాల అనంతరం.. జిల్లా అధ్యక్ష పదవితో పాటు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష, ఇతర పదవులకు పోటీ పడే నాయకులు పార్టీ పరిశీలకులను కలిసి తమ పేర్లను పరిశీలించాలని కోరుతూ దరఖాస్తులు ఇచ్చారు. వాటన్నింటినీ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని మంత్రి గొట్టిపాటి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నేతలకు హామీ ఇచ్చారు.‎‎