The Desk…Kaikaluru : రాంగ్ రూట్లో – రాచపట్నం బిల్డర్స్… కలవర పెడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్..‼️

The Desk…Kaikaluru : రాంగ్ రూట్లో – రాచపట్నం బిల్డర్స్… కలవర పెడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్..‼️

🔴 ఏలూరు జిల్లా : కైకలూరు మండలం : రాచపట్నం : THE DESK NEWS :

  • కోమాలో కైకలూరు మండల పంచాయతీ అధికారులు
  • కైకలూరులో – కమిషన్ పుచ్చుకో – కళ్ళు మూసుకో (అధికారుల తీరు)
  • అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం..❓
  • కైకలూరు మండలంలో అధికారుల కంటికి కనబడని అక్రమ కట్టడాలు
  • అధికార పార్టీ ప్రజా ప్రతినిధితో ప్రారంభోత్సవం‼️
  • కూటమి ప్రభుత్వానికి రేషన్ బియ్యం ఒకటేనా కాకినాడలో కంటికి కనిపించింది..❓
  • కైకలూరులో కట్టడాల పరిస్థితి ఏమిటి..❓
  • పేదలకు ఇచ్చిన భూమి బడా నేత కైవసం❓
  • పేదలకు ఇచ్చిన భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ వెలసిన వైనం..‼️
  • అక్రమ కట్టడం దారులకు కొమ్ముకాస్తున్న పాలకులు

గత పాలకుల మాదిరిగానే నేటి పాలకులు కూడా రాచపట్నం గ్రామంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టకపోతే గత పాలకుల గతే నేటి పాలకులకు పడుతుందని కూటమి ప్రభుత్వంపై ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్న వైనం..!!

ఇటీవల కాలంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్ట రాజ్యాంగ అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్ లు

ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేస్తున్న వైనం.

పర్యవేక్షణ లేకపోవడంతో మితిమీరుతున్న అక్రమ కట్టడాలు

రాచపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని వరాహపట్నం కూడలి నుండి కలిదిండి వెళ్లే రహదారి ప్రక్కన పోరంబోకు స్థలాలను గత ప్రభుత్వం ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే..!

అయితే ఆ ప్రాంతంలో ఒక బడా నేత అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిరుపేదలకు కేటాయించిన స్థలంలో అనుమతులు లేకుండా అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించిన వైనం..!!

రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణం చేపడుతున్నా అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ,పంచాయతీ అధికారులు..!!

ఈ బడా నేత కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి ఏకంగా ప్రజా ప్రతినిధితో ప్రారంభోత్సవం చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన వైనం..!!

స్థలం కబ్జా విషయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ… మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఫిర్యాదు చేస్తామంటున్న స్థానిక నాయకులు.

కబ్జా …కమర్షియల్ కాంప్లెక్స్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే… జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు..❓

డిప్యూటీ సీఎం మాత్రం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రాకూడదని కోరుతుండగా.. అధికారుల తీరు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉండటం కొసమెరుపు.

అయితే సెంటు భూమి ఆక్రమించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటీవల హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… మరి ఈ కాంప్లెక్స్ విషయంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

www.thedesknews.net