The Desk … Eluru : అభివృద్ధిలో ఏలూరును అగ్రగామిగా నిలుపుతాం

The Desk … Eluru : అభివృద్ధిలో ఏలూరును అగ్రగామిగా నిలుపుతాం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు కార్పొరేషన్ : ది డెస్క్ న్యూస్ :

పారదర్శక పాలన.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

ప్రశ్నలు రాకముందే సమస్యలకు పరిష్కారం

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

ఏలూరు అభివృద్ధికి కార్యాచరణ

చెత్తకు చెక్‌ – 62 డివిజన్లపై నిఘా

జవాబుదారీతనంతో పాలన

➖ చంటి (ఏలూరు ఎమ్మెల్యే)
➖అప్పలనాయుడు(మేయర్)

ప్రజల సమస్యలు ప్రశ్నలుగా మారకముందే పరిష్కరించేలా జవాబుదారీతనంతో పాలన అందిస్తామని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, నగర మేయర్‌ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు.

నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం శానిటరీ, పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. 62 డివిజన్లలో పారిశుద్ధ్యం, దోమల నివారణ, డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గతంలో మంజూరైన రోడ్లు, డ్రైనేజీ పనుల ప్రస్తుత స్థితిగతులను నూతన కార్పొరేటర్లకు వివరించాలని సూచించారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా, డ్రైన్లు నిరంతరం శుభ్రంగా ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, నగరాభివృద్ధే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

సమావేశంలో కమిషనర్‌ ఏ. భానుప్రతాప్‌, అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.