🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : గుడివాడ లంక :
కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ‘కత్తెర’ గుర్తుకు అఖండ మెజారిటీ ఇవ్వండి
➖ జయమంగళ దొరబాబు (కూటమి అభ్యర్థి, గుడివాకలంక)
డిసెంబర్ 2న జరగనున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు జయమంగళ దొరబాబు ప్రకటించారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆశీస్సులతో తనకు అవకాశం లభించిందని కృతజ్ఞతలు తెలిపారు. గుడివాకలంక గ్రామాభివృద్ధిలో ముందుండి పనిచేస్తానని, కార్యకర్తలు, నేతల సమక్షంలో ప్రతి పనీ పూర్తి చేయిస్తానని ప్రజల సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. తన ఎన్నికల గుర్తు ‘కత్తెర’ రెండో నంబర్లో ఉందని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ పెద్దలు, ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. గ్రామంలో మహిళలు, పురుషులు కలిపి అధికారికంగా 3,326 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

