The Desk … Vuyyuru : రూ.18,077 బకాయిలపై చర్యలేవి..?

The Desk … Vuyyuru : రూ.18,077 బకాయిలపై చర్యలేవి..?

🔴 కృష్ణాజిల్లా/కర్నూలు : ఉయ్యూరు :

రెవెన్యూ రికవరీ చట్టం–1864 ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

బకాయిల వసూళ్లలో జాప్యంపై లోకాయుక్త దృష్టికి

ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల వసూలు విషయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ… సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా వెనుకబడిన కులాల సహకార సంఘంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు పేర్కొన్న రూ.18,077 లీవ్ శాలరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆయన కోరారు.

ఈ వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త కేసు నంబర్ 1237/2017/LOK/B1, తేదీ 13-12-2024న జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించారు. అప్పటి కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కుమారి ఎ. ప్రభావతికి సంబంధించిన ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం–1864 ప్రకారం వసూలు చేయాలని 15-12-2025న రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

అయినప్పటికీ తదుపరి చర్యలపై దృష్టి సారించాలని కోరుతూ జంపాన శ్రీనివాస గౌడ్ లోకాయుక్తకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిధుల పరిరక్షణతో పాటు బకాయిల వసూళ్లలో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.