🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ న్యూస్ :
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసే అవకాశం
విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ ఓటు అవకాశం
ఓటు హక్కు వినియోగానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఉద్యోగులారా.. పోస్టల్ ఓటు మర్చిపోవద్దు
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
డ్యూటీలు కేటాయించబడిన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రానికి వచ్చే సమయంలో డ్యూటీ ఆర్డర్ కాపీ, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బీఎల్వోలు అందించిన ఓటరు స్లిప్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ఓటరు స్లిప్‌లోని వార్డు నంబరు, సీరియల్ నంబరు వివరాలు అవసరమని పేర్కొన్నారు.

