🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :
కంచల, కంచికచర్లలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
సౌమ్య ప్రచార జోరు
ఏకగ్రీవ ఏటూరు పాలకవర్గానికి అభినందనలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నందిగామ మండలం కంచల గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామిరెడ్డి సుబ్బారావుకు, కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థి గూడవల్లి గణేష్‌కు, 17వ వార్డు అభ్యర్థి జంపాని సీతకు మద్దతుగా ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కంచికచర్లలో 12, 13, 14, 15 వార్డుల్లో కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గూడవల్లి గణేష్‌కు ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏకగ్రీవ పాలకవర్గానికి అభినందనలు :
మరోవైపు చందర్లపాడు మండలం ఏటూరు గ్రామపంచాయతీ ఏకగ్రీవం కావడంతో నూతన సర్పంచ్ చలంచలం కృష్ణప్రసాద్, వార్డు సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి అభినందించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి సేవలందించాలని తంగిరాల సౌమ్య సూచించారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

