🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :
10 లక్షల సభ్యత్వం – టీడీపీకి డిజిటల్ బలం
కార్యకర్తల ఐక్యతకు నిదర్శనం
వారి కష్టానికి గుర్తింపునివ్వాలి
➖కురగంటి రాంబాబు
(బార్ అసోసియేషన్ న్యాయవాది,నందిగామ)
తెలుగుదేశం పార్టీ మైటీడీపీ యాప్లో సభ్యుల సంఖ్య పది లక్షలకు చేరడం కార్యకర్తల ఐక్యత, పార్టీ పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనమని నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాది కురగంటి రాంబాబు పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం, అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ, వారి సంక్షేమానికి నాయకత్వం కృషి చేయాలని సూచించారు.
మైటీడీపీ యాప్ ద్వారా నాయకత్వానికి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య అనుసంధానం బలోపేతం కావడం అభినందనీయమన్నారు.
పది లక్షల మంది సభ్యులుగా చేరిన పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. పదవులు, అధికారాలు మారినా పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని రాంబాబు పేర్కొన్నారు.

