The Desk … Bhimavaram : కార్తీక పౌర్ణమి వేళ.. మావుళ్లమ్మ సన్నిధిలో చండీహోమం

The Desk … Bhimavaram : కార్తీక పౌర్ణమి వేళ.. మావుళ్లమ్మ సన్నిధిలో చండీహోమం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

85 మంది దంపతులతో సామూహిక హోమం

స్వర్ణవస్త్ర ప్రాజెక్టుకు రెండు కాసుల బంగారం విరాళం

పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో చండీహోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 85 మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఇదే సందర్భంగా అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు భీమవరానికి చెందిన చింతలపాటి శ్రీవర్మ–పూజ రాజేశ్వరి దంపతులు 16 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. దాత దంపతులకు అర్చకులు పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి అభినందించారు.