🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :
ఏలూరు మేయర్‌గా అప్పలనాయుడు
డిప్యూటీగా పృధ్వీ శారద
కొలువుదీరిన కొత్త పాలకవర్గం
ఏలూరు నగర పాలనకు కొత్త జట్టు కొలువుదీరింది. నగర మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, డిప్యూటీ మేయర్‌గా పృధ్వీ శారద బాధ్యతలు చేపట్టారు. సోమవారం కార్పొరేషన్ సమావేశ మందిరంలో కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి వెట్రిసెల్వి నూతన మేయర్‌తో పాటు 62 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలో 37వ డివిజన్ కార్పొరేటర్ పృధ్వీ శారద డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అబ్జర్వర్ మిరియాల వెంకట శేషగిరిబాబు ప్రక్రియను పర్యవేక్షించారు.
నూతన పాలకవర్గానికి ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి, పత్సమట్ల ధర్మరాజు తదితరులు అభినందనలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, పత్సమట్ల ధర్మరాజు, కార్పొరేషన్ కమిషనర్ ఏ. భానుప్రతాప్, డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

