NTR జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :
నూతన పాలకవర్గానికి సౌమ్య సత్కారం
ప్రజల నమ్మకమే పునాది.. ప్రజాసేవే బాధ్యత
పదవులు అలంకారం కాదు..ప్రజాసేవకు వేదిక
బాధ్యతలు స్వీకరించారు.. అభివృద్ధిపై దృష్టి సారించండి
ప్రజా తీర్పుకు గౌరవం..పట్టణ ప్రగతికి ప్రాధాన్యం
ప్రజలు అప్పగించిన బాధ్యతను గుర్తిస్తూ, రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు ప్రాధాన్యమివ్వాలని నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నూతన మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. శ్రీకరం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అభినందన సభలో మున్సిపల్ చైర్మన్ శాఖమూరు వంశీధర్, వైస్ చైర్మన్ తొర్లికొండ సీతారామయ్యతో పాటు కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించి అభినందించారు.
పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మెరుగైన పాలన అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

