🔴 విజయవాడ : ది డెస్క్ న్యూస్ :
అనవసర సిజేరియన్లను నివారించాలి
ప్రతి ఇంటా సహజ ప్రసవంపై అవగాహన కల్పించాలి
తల్లీబిడ్డల క్షేమమే లక్ష్యం.. సహజ ప్రసవంపై వాక్‌థాన్
➖యం. రాజుబాబు
(ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జోన్ 2 ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు)
తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోన్–2 అధ్యక్షుడు యం. రాజుబాబు పిలుపునిచ్చారు. సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించిన సహజ ప్రసవాల అవగాహన వాక్‌థాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ :
గర్భిణులకు పోషకాహారం,
క్రమబద్ధమైన వైద్య పరీక్షలతో పాటు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు, మానసిక ధైర్యం ఎంతో అవసరమన్నారు. సహజ ప్రసవాలపై ప్రతి ఇంటా అవగాహన కల్పించాలని కోరారు.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నాగ శేషమ్మ మాట్లాడుతూ :
వైద్యపరంగా అవసరం లేకుండా మంచి రోజు, సమయం పేరుతో సిజేరియన్లను కోరుకోవడం సరికాదన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్య భద్రతే ప్రసవ విధానానికి ప్రాతిపదిక కావాలని స్పష్టం చేశారు. మిడ్‌వైవ్స్, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది సేవలు కీలకమన్నారు.
కార్యక్రమంలో నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు, అధ్యాపకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

