🟡 ఏలూరు జిల్లా :ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
పదవులు కాదు.. ప్రజాసేవే లక్ష్యం కావాలి
ప్రజా తీర్పుకు బాధ్యతతో సమాధానమివ్వాలి
అభివృద్ధే అజెండాగా ముందుకు సాగండి
నూతన ప్రజాప్రతినిధులకు ఎంపీ పుట్టా దిశానిర్దేశం
ప్రజలు నమ్మకంతో అప్పగించిన పదవులను ప్రజాసేవకు వేదికలుగా మలుచుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. ఏలూరు నగరానికి చెందిన నూతన కార్పొరేటర్లు, వివిధ ప్రాంతాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఆదివారం ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టార్ మహేష్ మాట్లాడుతూ :
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, పదవులు ప్రజలకు సేవ చేసే అవకాశాలని, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
నూతన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఏలూరులోని ఎంపీ కార్యాలయం సందడిగా మారింది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎంపీని కలవడం ప్రత్యేకత సంతరించుకుంది.

