🔴 అనకాపల్లి : ది డెస్క్ న్యూస్ :
ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
సర్వదోష నివారణకు రుద్ర హోమం
ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెంలోని నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు లోక కల్యాణార్థం రుద్ర హోమం నిర్వహించనున్నారు. సర్వజన సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబ క్షేమం, సమస్త దోష నివారణే లక్ష్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి దివ్య సన్నిధిలో జరిగే ఈ హోమంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్లబాబు), ధర్మకర్తలు, అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బుద్ధమహాలక్ష్మి నగేష్ కోరారు. హోమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు.

