The Desk … Nandigama : విభరింతలపాడు సర్పంచ్‌గా మీరా సాహెబ్‌ను గెలిపించండి.. గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజ్ఞప్తి

The Desk … Nandigama : విభరింతలపాడు సర్పంచ్‌గా మీరా సాహెబ్‌ను గెలిపించండి.. గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజ్ఞప్తి

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గo: చందర్లపాడు మండలం : ది డెస్క్ న్యూస్ :

చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామ సర్పంచ్ పదవికి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా “పోటీ చేస్తున్న షేక్ మీరా సాహెబ్‌కు” గ్రామ ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుధవారం నందిగామలోని తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 29న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని మీరా సాహెబ్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.