🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ న్యూస్ :
- చైర్పర్సన్ స్థానానికి 13, వార్డు సభ్యులకు 303 నామినేషన్లు అర్హత
- ఈ నెల 19 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు
తాడేపల్లిగూడెం పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ చైర్పర్సన్ మరియు 48 వార్డుల సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్ల గడువు నిన్నటితో ముగియగా, అధికారులు బుధవారం నామినేషన్ల పరిశీలనను పూర్తి చేశారు.
చైర్పర్సన్ బరిలో 13 మంది:
పట్టణ చైర్పర్సన్ పదవికి మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పరిశీలన అనంతరం వీరందరి నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలడంతో 13 మందిని అర్హులుగా (ఎలిజిబుల్) ప్రకటించారు.
పార్టీల వారీగా చైర్పర్సన్ నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి :
జనసేన: 5
వైఎస్సార్సీపీ: 2
ఇండిపెండెంట్లు: 2
బీజేపీ: 1
కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్): 1
సీపీఐ: 1
బీఎస్పీ: 1
వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన వివరాలు :
పట్టణంలోని 48 వార్డులకు గాను అభ్యర్థులు మొత్తం 304 నామినేషన్లను దాఖలు చేశారు. పరిశీలనలో భాగంగా ఒక నామినేషన్ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. నామినేషన్లో పేరు తప్పుగా ఉండటం లేదా ఇతర సాంకేతిక లోపాల కారణంగా వైఎస్సార్సీపీకి చెందిన ఒక సెట్ నామినేషన్ తిరస్కరింపబడినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం 303 నామినేషన్లు అర్హత సాధించాయి.
వార్డు సభ్యుల బరిలో నిలిచి అర్హత సాధించిన అభ్యర్థుల పార్టీల వారీ లెక్కలు ఇవే :
జనసేన: 100, వైఎస్సార్సీపీ: 91, టీడీపీ: 74, ఇండిపెండెంట్లు: 16, బీజేపీ: 14, సీపీఎం: 5, సీపీఐ: 2, బీఎస్పీ: 1
ఉపసంహరణకు, ‘ఫామ్-బి’ సమర్పణకు 19 వరకు గడువు :
నామినేషన్ల ఉపసంహరణకు, అలాగే పార్టీ తరఫున ‘ఫామ్-బి’ పత్రాలను ఎన్నికల అధికారికంగా సమర్పించడానికి ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు గడువు ఉందని అధికారులు స్పష్టం చేశారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు లేదా ఫామ్-బి అందజేయాల్సిన వారు నిర్ణీత సమ లోపు అధికారులను సంప్రదించాలని సూచించారు.

