🔴 ఢిల్లీ : THE DESK : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిషి నియమితులయ్యారు. ఆప్ శాసనసభాపక్షం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ మంగళవారం మీడియాకు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో కేజ్రీవాల్ స్వయంగా అతిషి పేరును ప్రతిపాదించారు. దీనికి మిగతా నాయకులు అంగీకారం తెలిపారు. ఆతిషి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో, ఆ పార్టీ నేతృత్వంలోని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నేత. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆమె ఆర్థిక, విద్య, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ వంటి కీలక శాఖల బాధ్యతలు చూశారు.
ఆతిషి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో కొన్నాళ్లపాటు పిల్లలకు పాఠాలు చెప్పారు.
కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో..‼️
‘దిల్లీ లిక్కర్ పాలసీ’ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ బెయిలుపై వచ్చాక సెప్టెంబర్ 15న పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. రెండు రోజులలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేస్తానని ప్రకటించారు.దీంతో కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి ఎవరుకానున్నారనే విషయంలో పలు పేర్లు తెరపైకి వచ్చాయి.కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ సహా ఆతిషి, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్ పేర్లు ముఖ్యమంత్రి పదవికి పరిశీలనలో ఉన్నాయని ప్రచారమైంది.ఇప్పుడు ఆప్ శాసనసభాపక్షం ఆతిషి ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేవరకూ ఆమె ఆ పదవిలో కొనసాగుతారు.కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు పాలన బాధ్యతలు ఒకరకంగా ఆతిషి నే చూశారు.కేజ్రీవాల్‌కు ఆతిశి పనితీరుపై విశ్వాసం ఉందని పార్టీ వర్గాలు చెప్తాయి.
సలహాదారు నుంచి సీఎం దాకా.. ఎవరీ ఆతిషీ..❓
2020లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ గెలిచాక కేజ్రీవాల్ మంత్రిమండలిలో మహిళలు ఎవరికీ చోటు దక్కలేదు. ఆ ఎన్నికలలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. వీరిలో 8మంది మహిళలు ఉన్నారు. కానీ మంత్రి మండలిలోకి వారిలో ఏ ఒక్కరినీ తీసుకోలేదు.అప్పట్లో ఆతిషి కి మంత్రిపదవి దక్కకపోవడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు.అయితే కాలక్రమంలో దిల్లీ రాజకీయాలు మారాయి.మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా మనిష్ సిసోదియా, సంజయ్ సింగ్ జైలుకు వెళ్ళడంతో పార్టీ వ్యవహారాల నుంచి ప్రభుత్వ వ్యవహారాల వరకు బాధ్యతలన్నీ ఆతిషీ చూసుకున్నారు. ఆతిషి తొలిసారి 2023లో మంత్రి అయ్యారు. ఆమెకు విద్యాశాఖ కేటాయించారు.దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్, త్రిప్తా వహి దంపతుల కుమార్తె అయిన ఆతిశి విద్యాభ్యాసం దిల్లీలోని స్ప్రింగ్‌డేల్ పాఠశాలలో సాగింది.అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె హిస్టరీలో డిగ్రీ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం ఆ తరువాత కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె సమీపంలో ఉన్న రిషివ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధించారు. భోపాల్‌లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఆమ్ అద్మీ పార్టీతో, ప్రశాంత్భూషణ్తోనూ పరిచయం ఏర్పడింది. ఆతిషీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె అప్పటి దిల్లీ విద్యాశాఖ మంత్రి మనిష్ సిసోదియాకు 2015 నుంచి 2018వరకు సలహాదారుగా పనిచేశారు.ఆమ్ అద్మీ పార్టీ వెబ్‌సైట్‌లోని తెలిపిన సమాచారం మేరకు ఆమె సిసోదియా సలహాదారుగా పనిచేయడంతోపాటు దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కఠిన నిబంధనలు విధించారు.ఆతిషి ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా.ప్రస్తుతం ఆతిశి చేతిలో దిల్లీ విద్యాశాఖతోపాటు ఉన్నత విద్య, టెక్నికల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎనర్జీ, రెవెన్యూ, ప్లానింగ్, ఫైనాన్స్, విజిలెన్స్, వాటర్, పబ్లిక్ రిలేషన్స్ లా అండ్ జస్టిస్ శాఖలు ఉన్నాయి.ప్రస్తుతం ఆమె దిల్లీలోని కాల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
www.thedesknews.net