The Desk … Anakapalli : ఆకాశ దీపం.. అఖండ జ్యోతి

The Desk … Anakapalli : ఆకాశ దీపం.. అఖండ జ్యోతి

🔴 అనకాపల్లి జిల్లా : అనకాపల్లి : ది డెస్క్ న్యూస్ :

కార్తీక దీపకాంతులతో నూకాంబిక ఆలయం

లోకక్షేమం కోసం కార్తీక దీపారాధన

నూకాంబిక సన్నిధిలో కార్తీక శోభ

భక్తిభావంతో ఆకాశ దీపం, అఖండ దీపం ప్రారంభం

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అనకాపల్లి గవరపాలెంలోని ప్రసిద్ధ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆకాశ దీపం, అఖండ దీపాన్ని భక్తిశ్రద్ధలతో ప్రజ్వలన చేశారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.

లోకక్షేమం, సకల జనుల శ్రేయస్సుకు ఆకాశ దీపం ప్రతీకగా నిలవగా.. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రసరింపజేసే సంకేతంగా అఖండ దీపాన్ని భక్తులు భావిస్తారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.

కార్తీక మాసమంతా భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని దీపారాధనలో పాల్గొనాలని దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను, అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారినాగేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.