The Desk …Anakapalli : శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో విజేతలకు ఘన సత్కారం

The Desk …Anakapalli : శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో విజేతలకు ఘన సత్కారం

🔴 అనకాపల్లి జిల్లా : అనకాపల్లి : ది డెస్క్ న్యూస్ :

అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న కార్పొరేటర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు

ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాల అందజేత

అమ్మవారి చెంతకు ఎన్నికల విజేతలు

నూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవకు శ్రీకారం

విజయోత్సాహం.. ఆధ్యాత్మిక పరవశం

అమావాస్య పూజల్లో పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం భక్తజన సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆశ్వయుజ మాస అమావాస్య సందర్భంగా ఆదివారం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అమావాస్య పూజల్లో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందిన జీవీఎంసీ కార్పొరేటర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఆలయ అర్చకుల చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలకవర్గం విజేతలైన ప్రజాప్రతినిధులను ఆలయ సంప్రదాయాలు, మర్యాదలతో ఘనంగా సత్కరించింది. అమ్మవారి చిత్రపటాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రజాసేవలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించింది.

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మినగేష్, ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారినాగేష్ తదితరులు పాల్గొన్నారు.