The Desk … Eluru: ▪️ఆపదలో ఒక్క క్లిక్▪️

The Desk … Eluru: ▪️ఆపదలో ఒక్క క్లిక్▪️

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

అండగా ఖాకీ కవచం

శక్తి యాప్‌పై అవగాహన

ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో “ఓపెన్ హౌస్”

మీ భద్రత మా బాధ్యత

అన్యాయంపై సమరం.. ఆడబిడ్డలకు అభయం

అత్యవసర వేళ అండగా.. అరచేతిలో శక్తి

భయపడొద్దు.. ఫిర్యాదు చేయండి

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో “ఓపెన్ హౌస్” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో.. మహిళా ఎస్‌ఐ నాగమణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు, బాలికల భద్రతకు ఉద్దేశించిన శక్తి యాప్ వినియోగం, అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం పొందే విధానంపై అవగాహన కల్పించారు. మహిళా పోలీసుల విధులు, బాధితులకు అందించే సహాయం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను వివరించారు. వేధింపులు, భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, మహిళల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.