The Desk … Mudinepalli : అమరావతి అభివృద్ధికి రూ.1,116 విరాళం

The Desk … Mudinepalli : అమరావతి అభివృద్ధికి రూ.1,116 విరాళం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో విజయవాడకు చెందిన జె.పి.ఎఫ్. వ్యవస్థాపక అధ్యక్షుడు బి. దయానందం, ఆర్. రాజ్‌కుమార్‌ తమ కుటుంబాల తరఫున రూ.1,116 విరాళంగా అందించారు.

గురువారం ఉదయం ముదినేపల్లిలోని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ ఆసుపత్రికి వచ్చిన వారు, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) అందుబాటులో ఉంచిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా విరాళాన్ని అందజేశారు. అమరావతి అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురిని డాక్టర్ మనోజ్ అభినందించారు.