The Desk … Tadepalligudem : తుఫాన్‌ వేళ.. క్షేత్రస్థాయిలో కమిషనర్‌ పర్యటన.. రోడ్లు, డ్రైన్లు, పునరావాస కేంద్రాల పరిశీలన

The Desk … Tadepalligudem : తుఫాన్‌ వేళ.. క్షేత్రస్థాయిలో కమిషనర్‌ పర్యటన.. రోడ్లు, డ్రైన్లు, పునరావాస కేంద్రాల పరిశీలన

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ప్రధాన రహదారులు, డ్రైన్లు, ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను పరిశీలించి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాలులకు విరిగిపడిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా రహదారులను క్లియర్‌ చేయించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, విద్యుత్‌ తీగలు, శిథిల భవనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన వారు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు.

పర్యటనలో ఇంజినీరింగ్‌, పబ్లిక్‌ హెల్త్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.