The Desk…Banaganapalle : స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం ➖మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

The Desk…Banaganapalle : స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం ➖మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

🟡 నంద్యాల జిల్లా : బనగానపల్లె : ది డెస్క్ :

అభ్యర్థుల ఎంపికపై మంత్రి సమీక్ష

స్థానిక ఎన్నికలపై కూటమి కసరత్తు

అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం

బనగానపల్లె నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాపులపల్లె ఫామ్‌హౌస్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికపై వార్డులవారీగా సమీక్షించారు. స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యమిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేసిన మంత్రి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు బలమని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొన్నారు.