The Desk … Eluru : అ… అంటే అమలాపురం కాదు.. అ.. అంటే..!! ఆపదలో ఆపన్నహస్తం

The Desk … Eluru : అ… అంటే అమలాపురం కాదు.. అ.. అంటే..!! ఆపదలో ఆపన్నహస్తం

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

అనాథ వృద్ధురాలికి అండ

అభాగ్యురాలికి అండగా

ఆదుకున్న శక్తి టీమ్

అభాగ్యురాలి పాలిట ఆపద్బాంధవులు

అనాథ వృద్ధురాలికి ఆసరా

ఆస్పత్రికి తరలింపు

@శక్తి టీమ్

వివారాల్లోకి వెళితే..
ఆపదలో ఉన్న అభాగ్యురాలికి ఆపన్నహస్తం అందించి ఏలూరు జిల్లా శక్తి టీమ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీవ్ర అస్వస్థతతో, కనీసం కదల్లేని స్థితిలో ఉన్న ఓ వృద్ధ మహిళను 112 అత్యవసర కాల్‌ ద్వారా అందిన సమాచారంతో గుర్తించారు.

వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను తమ వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్యులకు వివరాలు అందించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.

ఆపదలో ఉన్న వృద్ధురాలికి అండగా నిలిచిన శక్తి టీమ్, ఆమెకు వైద్యం అనంతరం ఆశ్రయం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

వృద్ధురాలి వివరాలు తెలిసినవారు ఏలూరు రూరల్‌ ఎస్‌ఐను 9440796636 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి తక్షణ సాయం అందించిన శక్తి టీం సభ్యుల చొరవపై అభినందనలు వ్యక్తమయ్యాయి.