🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

ఆరు కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపన
రహదారులు, వైద్య సేవలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
నందిగామ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
రోడ్లు.. కమ్యూనిటీ హాళ్లు.. వైద్య సేవలు
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు

నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పలు కార్యక్రమాలు చేపట్టారు. నందిగామలో ఆరు జీ+1 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, 7వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి రూ.8.60 లక్షలు కేటాయించారు. పల్లగిరి గట్టు ఎస్సీ శ్మశానవాటికలో రూ.16 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో షెడ్డు, ప్రహరీ, రహదారి పనులకు శ్రీకారం చుట్టారు.

కంచికచర్ల మండలం కీసర–ఎస్. అమరవరం బీటీ రహదారికి రూ.2 కోట్లు, కీసరలో మరో రహదారికి రూ.30 లక్షలు, కునికినిపాడులో బీటీ రహదారికి రూ.56 లక్షలతో పనులు ప్రారంభించారు. కునికినిపాడులో విలేజ్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించారు. అనాసాగరంలో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ మంజూరుకు కృషి చేశారు. అలాగే నందిగామ డంపింగ్ యార్డును పరిశీలించి, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

