🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దరి : ది డెస్క్ :

కాల్దరి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంతో పాటు, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులు సూచించారు. స్వచ్ఛరథం ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరువ చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా రోడ్లపై చెత్తాచెదారం, దుమ్ము తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇళ్ల వద్ద కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

