The Desk … Tadepalligudem : పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

The Desk … Tadepalligudem : పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్‌ సమీక్ష

పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పనకు ఆదేశాలు

రాబోయే ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు ఇంజినీరింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో తాగునీరు, విద్యుత్‌, ర్యాంపులు, మరుగుదొడ్లు తదితర వసతులను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు.

సమావేశంలో మున్సిపల్‌ ఇంజినీర్‌ వై. వెంకటరమణతో పాటు డిప్యూటీ, అసిస్టెంట్‌ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.