The Desk … Bhimavaram : మావుళ్లమ్మకు ప్రముఖుల పూజలు

The Desk … Bhimavaram : మావుళ్లమ్మకు ప్రముఖుల పూజలు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

స్వర్ణ రజిత కవచాలంకారంలో అమ్మవారి దర్శనం

శరన్నవరాత్రుల్లో సర్వాంగ సుందరంగా మావుళ్లమ్మ

పట్టణంలోని ప్రసిద్ధ ఆరాధ్యదైవం మావుళ్లమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వర్ణ రజిత కవచాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు, వెండి కవచాలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

ఈ సందర్భంగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు భరత్‌ గౌడ్‌, కల్పనశ్రీ దంపతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్‌, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్‌, ఉదిసి మీనాక్షి, అతికేలా ఆంజనేయ ప్రసాద్‌, మిర్తిపాటి గున్నేశ్వరరావు, గుసిడి నాగశిరీష, అరసవల్లి సుబ్రహ్మణ్యం, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.