🔴 పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :
రామాయణపురం దంపతుల ఉదారత
దాతలకు ఆలయ అర్చకుల ఆశీర్వచనం
భీమవరం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మావుళ్లమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి రామాయణపురానికి చెందిన గుడ్డాతి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి దంపతులు రూ.60 వేల విరాళాన్ని అందజేశారు. భక్తులకు నిత్యం అన్నప్రసాదం అందించే కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దంపతులకు పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ వారికి శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదం, ఫొటోను అందజేశారు.
ఈ వివరాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ వెల్లడించారు.

