🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
ఉత్సవాల బుక్లెట్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రామాంజనేయులు
భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రిదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. బుధవారం తన నివాసం వద్ద ఉత్సవాల బుక్లెట్ను ఆవిష్కరించారు. పది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ :
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సౌకర్యాలు, క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఈ నెల 22న అన్నసమారాధన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బోండాడ నాగభూషణం, ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, పాలకవర్గ సభ్యులు, నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

