The Desk … Eluru : మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి ➖ ఎమ్మెల్యే చంటి పిలుపు

The Desk … Eluru : మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి ➖ ఎమ్మెల్యే చంటి పిలుపు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏలూరు అశోక్‌నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘సేవా సంకల్ప సభ’ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని చంటి పేర్కొన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్‌ కిషోర్‌తో కలిసి ‘వి విల్‌ డూ ఇట్‌ మోదీజీ’ డిస్‌ప్లేను ఆవిష్కరించారు. ప్రత్యేక రథంపై ‘సేవా జ్యోతి యాత్ర’ ను ప్రారంభించారు. ఆయుష్‌ ఆసుపత్రి, విజయవిహార్‌ సెంటర్‌, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌, జెడ్పీ కార్యాలయం సెంటర్‌ మీదుగా యాత్ర సాగింది. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.