The Desk … Eluru : న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం ➖ ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం ➖ ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే బడేటి చంటి సంఘీభావం

అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కోసం గళం

అసెంబ్లీలో ప్రస్తావిస్తా

విధి నిర్వహణలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అవసరమని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అమలు కోరుతూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపారు.

దీక్షా శిబిరంలో న్యాయవాదులతో కలిసి కూర్చున్న ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

న్యాయవాదులను బెదిరించడం, గాయపరచడం, ఆస్తులకు నష్టం కలిగించడం వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టపరమైన రక్షణ అవసరమన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో చర్చిస్తానని తెలిపారు. న్యాయవాదులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అనంతరం న్యాయవాదులు ఎమ్మెల్యే చంటిని సన్మానించారు.