The Desk … Vunguturu : ▪️గాంధీ బాటలో గ్రామసభలు▪️

The Desk … Vunguturu : ▪️గాంధీ బాటలో గ్రామసభలు▪️

🔴 కృష్ణాజిల్లా : ఉంగుటూరు మండలం : పెద్దఅవుటపల్లి : ది డెస్క్ :

పెద్దఅవుటపల్లిలో గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పెద్దఅవుటపల్లిలో గ్రామ పంచాయతీలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు, ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా.. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై గ్రామసభల్లో చర్చించారు

ఈ కార్యక్రమంలో పెద్దఅవుటపల్లి పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడి వర్కర్స్, హెల్త్, డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.