The Desk … Eluru : కూటమి గెలుపే లక్ష్యం.. విభేదాలకు చోటివ్వొద్దు➖ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : కూటమి గెలుపే లక్ష్యం.. విభేదాలకు చోటివ్వొద్దు➖ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : తెదేపా జిల్లా కార్యాలయం : ది డెస్క్ :

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక, కూటమి సమన్వయంపై చర్చించారు.

కూటమిలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయానికి అన్ని పార్టీల శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని చంటి సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు జిల్లా నాయకులు, మీడియా కోఆర్డినేటర్ కంప్యూటర్ ప్రసాద్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.