🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గo : ది డెస్క్ :
విద్యార్థుల కోసం 40 మంచాల అందజేత :
అశోక్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యార్థం దాతల సహకారంతో సమకూర్చిన 40 మంచాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ :
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
జుజ్జూరులో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు :
పల్లె పండుగ 3.0లో పనులకు శంకుస్థాపన :
జుజ్జూరు గ్రామంలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.80 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు.
అల్లూరు ఎస్సీ కాలనీలో రూ.60 లక్షల రోడ్డు :
పేదల కాలనీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యత :
అల్లూరు ఎస్సీ కాలనీలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలు, పేదల నివాస ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని ఆమె పేర్కొన్నారు. రోడ్డు పూర్తయితే స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
పేదల వైద్యానికి సీఎం సహాయనిధి భరోసా :
నియోజకవర్గంలో 276 మందికి రూ.1.37 కోట్ల సాయం :
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.25.51 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆమె అందజేశారు. నందిగామ నియోజకవర్గంలో మొత్తం 276 మందికి రూ.1,37,11,559 సాయం మంజూరైనట్లు తెలిపారు.

