🔴 పగో : తాడేపల్లిగూడెం : డెస్క్ :
“WASTE TO WONDER” – పాత టైర్లతో అందమైన అలంకరణ
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ – 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో “WASTE TO WONDER” థీమ్ తో పాత టైర్లతో అందంగా అలంకరణ చేశారు. మున్సిపల్ కమిషనర్ M. యేసుబాబు ఆధ్వర్యంలో పనికిరాని పాత వాహన టైర్లకు రంగులు వేసి, వాటిలో మొక్కలు నాటి, వర్టికల్ గార్డెన్ లా తయారు చేశారు. చెత్త నుండి అద్భుతం సృష్టించవచ్చని, వ్యర్థ పదార్థాలను కూడా అందంగా తీర్చిదిద్ది పర్యావరణానికి ఉపయోగపడేలా చేయవచ్చని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు. అంతేకాకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్క్రాప్ మెటీరియల్ తో తయారు చేసిన కళాకృతుల వద్ద కూడా స్వచ్ఛత హి సేవ బ్యానర్లతో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :
పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వ్యర్థాల పునరుపయోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు పేర్కొన్నారు. ‘స్వచ్ఛత హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెంలో వేస్ట్ నుంచి వండర్ (వ్యర్థాల నుంచి ఆకర్షణీయ వస్తువుల తయారీ) కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
▪️ చెత్త నుంచి అందమైన ఆకృతులు :
గతంలో ఎస్వీఆర్ జంక్షన్ ఫుడ్ కోర్టు వద్ద వ్యర్థాలతో గుర్రం (హార్స్) ఆకృతిని, రైల్వే స్టేషన్ రోడ్డులో మరికొన్ని ఆర్టికల్స్‌ను తయారు చేసి ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
▪️పాత టైర్లతో అలంకరణ :
పాత టైర్లకు రంగులు వేసి, వినూత్న డిజైన్లతో పట్టణ పురపాలక సంఘంలో అందమైన అలంకరణ వస్తువులుగా మారుస్తున్నామని వివరించారు.
▪️ ఇంటి వద్దే చెత్త వేరుచేయడం :
ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద పాత టైర్లు, వ్యర్థ కుండీలను అందంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని కోరారు.
▪️ కంపెనయ్యే ఎరువు – ఆర్గానిక్ కూరగాయలు :
తడి చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని, దాని ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు, కూరగాయలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కమిషనర్ యేసుబాబు కోరారు.
PGRS కార్యక్రమం – ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం
మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమంలో కమిషనర్ ఎం. యేసుబాబు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఆస్తిపన్ను, పారిశుద్ధ్య సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.
కొన్ని సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కమిషనర్ తెలిపారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

