The Desk …RJY : ▪️రహదారులపైకి నీరు▪️ రాజవోలు, కొలమూరులో పొంగిపొర్లిన చెరువులు

The Desk …RJY : ▪️రహదారులపైకి నీరు▪️ రాజవోలు, కొలమూరులో పొంగిపొర్లిన చెరువులు

🔴 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ న్యూస్ :

అధికారుల అప్రమత్తతతో మళ్లింపు

భారీ వర్షాల ప్రభావంతో రాజవోలు, కొలమూరు ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. గురువారం ఉదయం రాజవోలులోని రెండు చెరువులు, కొలమూరులోని మరో చెరువు నీటిమట్టం పెరిగి పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది.

సమాచారం అందుకున్న తహసీల్దార్‌, ఎంపీడీవో సునీల్ ఆమ్ స్ట్రాంగ్ వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రహదారులపైకి చేరిన వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేసి, నీటిని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించే చర్యలు చేపట్టారు. దీంతో ప్రధాన రహదారులపై నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కాలువలు, లోతట్టు ప్రాంతాల వద్ద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అవసరం లేకుండా వరద నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, రహదారులపై నీరు ప్రవహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.