The Desk… Eluru : లోకేశ్‌తో ఎంపీ పుట్టా మహేష్‌ భేటీ

The Desk… Eluru : లోకేశ్‌తో ఎంపీ పుట్టా మహేష్‌ భేటీ

🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :

పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొన్న ఏలూరు ఎంపీ

న్యూఢిల్లీలోని తాజ్‌ మహల్‌ హోటల్‌లో గురువారం నిర్వహించిన ‘పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా’ 13వ వార్షిక సదస్సులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌ను ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం లోకేశ్‌, కూటమి ఎంపీలతో జరిగిన సమావేశంలో పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.