🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం :

₹12,25,367 విలువైన CMRF చెక్కులను బాధితులకు అందించిన ఎమ్మెల్యే చంటి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల వైద్య సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా లబ్ధిదారులకు వంద శాతం సాయం అందించామని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్‌ఎఫ్ నిధుల ద్వారా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి, ఎవరికీ ఎలాంటి విజ్ఞప్తి బకాయి లేకుండా వేగంగా చెక్కులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు.
తాజాగా 8 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు, 3 ఎల్‌ఓసీ (LOC) పత్రాలకు సంబంధించి మొత్తం ₹12,25,367 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. గత రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో మొత్తం 849 మంది బాధితులకు ₹7.57 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించామని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ‘సంజీవని’ పథకం అమల్లోకి వస్తే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పనిలేకుండా, ఆసుపత్రుల్లో నేరుగా ఉచిత వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే చంటి వివరించారు.

