The Desk … Bhimavaram : మావుళ్లమ్మ స్వర్ణ వస్త్రానికి బంగారు కానుక

The Desk … Bhimavaram : మావుళ్లమ్మ స్వర్ణ వస్త్రానికి బంగారు కానుక

🔴 పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :

స్వర్ణ వస్త్రానికి భక్తుడి 2 కాసుల బంగారు కానుక

భీమవరం పట్టణ ప్రజల ఇలవేల్పు, ఆరాధ్యదైవంగా కొలువుదీరిన మావుళ్లమ్మవారి ఆలయంలో చేపట్టిన ‘సంపూర్ణ స్వర్ణ వస్త్రం’ ప్రాజెక్టుకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా భీమవరానికి చెందిన గవర శేషగిరిరావు తన కుమారుడు గవర రాహుల్ పేరు మీద అమ్మవారికి 16 గ్రాముల బంగారాన్ని విరాళంగా సమర్పించారు.

అమ్మవారి పట్ల భక్తి, ఆలయ అభివృద్ధిపై ఉన్న విశ్వాసంతో స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు బంగారం అందజేయడం అభినందనీయమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. దాత గవర రాహుల్ పేరుతో సమర్పించిన బంగారు విరాళాన్ని ఆలయ అధికారులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాత కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం దాతను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు, ప్రసాదం తదితరులు పాల్గొన్నారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ ప్రసాదం, ఫొటో అందజేశారు.

అమ్మవారి స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తులు తమవంతు సహకారం అందిస్తూ భాగస్వాములు కావడం ద్వారా ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించవచ్చని ఆలయ వర్గాలు తెలిపారు.