🔴 ఏలూరు జిల్లా : రష్యా//ఏలూరు : ది డెస్క్ :

దేశభక్తిని సాహసంతో మేళవిస్తూ ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణుల్లో 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించి, అక్కడ సుమారు 100 మీటర్ల పొడవైన భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతికూల వాతావరణం, తీవ్ర చలి, ఎత్తు వంటి సవాళ్లను అధిగమించి ఈ సాహసం చేశారు. శిఖరాగ్రంపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తన సాహస ఘనతను దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అంకితం చేశారు. ఆయన విజయం యువతకు దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారులు అభినందించారు.
ఏలూరు రూరల్ ఎస్సై వి వెంకటేశ్వరరావుపై “ది డెస్క్” స్పెషల్ స్టోరీ…
“ఏడుకొండలు కాదు… ఎన్ని కొండలైనా..!!”
ఖాకీలో పర్వతారోహకుడు
మౌంట్ ఎల్బ్రస్ శిఖరమే అతని గమ్యం.!
“ఆకాశం నీ హద్దురా… అవకాశం వదలొద్దురా…”
సినీ గీతాల్లో వినిపించే ఈ స్ఫూర్తిదాయక సందేశాన్ని తన జీవిత లక్ష్యంగా మార్చుకుని ముందుకు సాగుతున్నారు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, ప్రజాసేవలో నిబద్ధత చూపుతూ… మరోవైపు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పై 100 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే మహత్తర లక్ష్యంతో కఠోర సాధన చేసి అరుదైన ఘనత రికార్డు సృష్టించారు.

విధుల్లో పోలీస్… శిఖరాలపై విజేత :
స్టేషన్లో డ్యూటీ… శిఖరాలపై మేటి… అనే మాటలు ఆయనకు అచ్చం సరిపోతాయి. సాధారణంగా కొండలను చూసి వెనక్కి తగ్గే వారు ఉంటే, ఈ ఖాకీ అధికారి మాత్రం ప్రతి శిఖరాన్ని ఒక సవాల్‌గా స్వీకరించి ముందుకు సాగుతున్నారు.
హాబీగా పర్వతారోహణను ఎంచుకున్న వెంకటేశ్వరరావు ఇప్పటికే ఎన్నో పర్వతాలను విజయవంతంగా అధిరోహించారు. కొండలను జయిస్తూ… మౌంట్ ఎల్బ్రస్ ను లక్ష్యంగా చేసుకున్న ఆయన ప్రయాణం ఇప్పుడు మరింత వేగంగా సాగింది.
“చెట్టులెక్కగలవా ఓ నరహరి… పుట్టలెక్కగలవా..!”
ప్రముఖ సినీ గేయాన్ని తలపిస్తూ… చెట్టులే కాదు, కొండలు… గుట్టలు… శిఖరాలు ఎక్కేస్తానంటూ తన సంకల్పాన్ని చేతల్లో చూపిస్తున్నారు ఎస్ఐ వెంకటేశ్వరరావు. ప్రతి అధిరోహణను ఒక సాధనగా, ప్రతి శిఖరాన్ని ఒక పాఠంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు.
పుష్ప డైలాగ్ గుర్తుకు తెస్తున్న వెంకన్న :
“వెంకన్న స్వామిని చూడాలంటే ఎన్ని కొండ లెక్కాల్నో… ఇట్టాంటి సరుకు దొరకాలంటే అన్ని కొండలు దిగాలి… ఇది బంగారం A గ్రేడ్ సరుకు!!”
అంటూ పుష్ప సినిమాలో వినిపించిన డైలాగ్‌ను గుర్తు చేసే విధంగా… ఈ వెంకన్నను చూడాలంటే అస్సలు తగ్గేదేలే అంటూ.. మనం కూడా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే..!!
ఏడుకొండల వెంకన్న భక్తుడివా… ఎన్నో కొండల అధిరోహకుడివా..!
ఏడుకొండల వెంకన్న భక్తుల హృదయాల్లో కొలువై ఉంటే… ఈ వెంకన్న మాత్రం శిఖరాల గుండెల్లో తన ముద్ర వేస్తున్నారు. ఖాకీ నుంచి శిఖరాల వరకు సాగుతున్న ఆయన విజయయాత్ర పోలీస్ శాఖలోనే కాకుండా యువతలోనూ స్ఫూర్తిని నింపుతోంది.
ఖాకీ గుండెలో.. సాహస యోధుడు :
పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ సాహస క్రీడల్లోనూ రాణించడం అరుదైన విషయం. అందుకే సహచరులు, స్నేహితులు ఆయనను—
▪️”ఖాకీలో శిఖర విజేత”
▪️"పోలీస్ డిపార్ట్మెంట్ పుష్ప"
▪️“ఎత్తయిన శిఖరం వైపు దూసుకెళ్తున్న వెంకన్న”
▪️“సాహసమే శ్వాసగా… శిఖరాలపై ఖాకీ జెండా”
అంటూ ప్రశంసిస్తున్నారు.

శిఖరమే లక్ష్యం… విజయం అతని ప్రయాణం :
ఇప్పటికే అనేక పర్వతాలను జయించిన వెంకటేశ్వరరావు, ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించే దృడ లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. మరో రెండు నెలల్లో ఎవరెస్ట్ యాత్రకు వెళ్లనున్న ఆయన, తన కలను సాకారం చేసుకునేందుకు శారీరకంగా, మానసికంగా కఠోర సాధన చేస్తున్నారు.
డ్యూటీకి పోలీస్… డ్రీమ్‌కు మౌంటెనీర్గా మారిన ఈ సాహసికుడు, కొండలతో పోటీ పడుతూ… ఎవరెస్ట్‌తో సవాల్‌కు సిద్ధమవుతున్నారు.
“వెంకన్న స్వామిని చూడాలంటే ఏడుకొండలు ఎక్కాలి – ఈ వెంకన్నను చూడాలంటే ఎన్నో శిఖరాలు దిగాలి!” :
అనే మాటలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి. ఎందుకంటే సాధారణ జీవితాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నా… అసాధారణ లక్ష్యాన్ని ఎంచుకుని అడుగులు వేస్తున్నారు వెంకటేశ్వరరావు.
ఖాకీలో సాహస శిఖరం… ఎత్తయిన శిఖరాల వైపు అడుగులు :
సాహసమే శ్వాసగా… శిఖరాలపై ఖాకీ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏలూరు పోలీస్ శాఖకు మాత్రమే కాదు… యువతకు, క్రీడాకారులకు, లక్ష్యసాధకులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు.
“ఆకాశం నీ హద్దురా… అవకాశం వదలొద్దురా…” అనే సందేశాన్ని జీవన సత్యంగా మార్చుకుని… “శిఖరమే లక్ష్యం… విజయం నా ప్రయాణం” అనే ధ్యేయంతో ఎత్తైన శిఖరాల వైపు వైపు అడుగులు వేస్తున్న ఈ ఖాకీ అధికారి ప్రయాణం విజయవంతం కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఏడుకొండల వెంకన్న భక్తుల హృదయాల్లో ఉంటే… ఈ వెంకన్న మాత్రం శిఖరాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుందాం..!
“ఇట్టాంటి వ్యక్తిని చూడాలంటే… ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందే..!!”
సశేషం////__@
✍️✍️ ఎడిటర్ “ది డెస్క్” విశ్వనాథ్

