🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

పల్లగిరి కొండపై క్రీస్తు సంఘము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంఘ పెద్దలు, కూటమి నేతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి స్ఫూర్తితో దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.

