The Desk … Eluru : ఏలూరులో హర్‌ ఘర్‌ తిరంగా హోరు

The Desk … Eluru : ఏలూరులో హర్‌ ఘర్‌ తిరంగా హోరు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

త్రివర్ణ పతాకాలతో కదిలిన భారీ ర్యాలీ

దేశభక్తి నినాదాలతో మార్మోగిన రహదారులు

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వన్‌టౌన్‌ పేరయ్య కోనేరు నుంచి పాతబస్టాండ్‌ నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకు సాగిన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో రహదారులు త్రివర్ణమయమై, దేశభక్తి నినాదాలతో మార్మోగాయి.
పాతబస్టాండ్‌ జంక్షన్‌లో నిర్వహించిన భారీ మానవహారంలో బడేటి చంటి పాల్గొన్నారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని కోరారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.