The Desk…Yeturu : సర్వాంగ సుందరంగా ముస్తాబైన జాతిపిత

The Desk…Yeturu : సర్వాంగ సుందరంగా ముస్తాబైన జాతిపిత

🔴 ఎన్టీఆర్ జిల్లా : చందర్లపాడు మండలం : ఏటూరు : ది డెస్క్ :

“ది డెస్క్ఎఫెక్ట్ :

వార్తా కథనానికి స్పందన :

ఒకే ఒక్క వార్త – ఏటూరు గ్రామంలో చలనం

గాంధీ విగ్రహానికి గ్రామస్థుల చొరవతో రంగులు

దాదాపు 1లక్ష రూపాయల భారీ విరాళంతో మహాత్మునికి రూపం

మహాత్ముని విగ్రహం చుట్టూ ప్లాట్ఫామ్.. ఐరన్ పైపు రైలింగ్

నేను సైతం అంటూ.. (దాత) తుమ్మాటి వీరభద్రరావు ముందుకు..

ఏటూరు – “ఎక్కడా తగ్గేదేలే” అంటున్న గ్రామస్తులు

చందర్లపాడు మండలం ఏటూరులో గాంధీ విగ్రహం పరిసరాల అపరిశుభ్రతపై ‘ది డెస్క్’ పత్రికలో వచ్చిన కథనానికి స్పందన లభించింది.

గ్రామానికి చెందిన కొందరు ముందుకొచ్చి, ప్రధానంగా తుమ్మాటి వీరభద్రరావు అనే స్థానిక వ్యక్తి ముందుకు వచ్చి మహాత్మాగాంధీ విగ్రహానికి రంగులు వేయించి, చుట్టూరు సిమెంట్ దిమ్మతో, ఐరన్ పైపు రైలింగ్ తో దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఔరా అనిపించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ గ్రామస్థుల చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Note: రేపు ఆగస్టు 15న నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఏటూరు గ్రామానికి వచ్చి, సర్వాంగ సుందరంగా ముస్తాబైన జాతిపిత విగ్రహానికి పూలమాల వేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఏటూరు గ్రామస్తులు.