The Desk… Tadepalligudem : ▪️భోగాపురం సిద్ధం▪️

The Desk… Tadepalligudem : ▪️భోగాపురం సిద్ధం▪️

🟡 విజయనగరం జిల్లా : భోగాపురం/ఏలూరు : ది డెస్క్:

ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

మోదీ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

భోగాపురం సభా వేదికను పరిశీలించిన ప్రజాప్రతినిధులు

విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

ఆగస్టు 1 ప్రారంభోత్సవానికి తుది ఏర్పాట్లు

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో.. సభా వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, పోలవరం నియోజకవర్గ పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు చల్లా వెంకట సత్య వరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్)తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.